News

చంద్రబాబుపై వెంకయ్యనాయుడు ప్రశంసలు


తక్కువ సమయంలోనే అద్భుతమైన సచివాలయం నిర్మించడం ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదక్షతకు నిదర్శనమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సీఎంతో కలిసి వెలగపూడిలోని సచివాలయాన్ని గురువారం ఉదయం వెంకయ్యనాయుడు పరిశీలించారు. భవనాల నిర్మాణం గురించి చంద్రబాబు వివరించారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రపదేశ్‌కు తొలి ర్యాంకు రావడంపై వెంకయ్య అభినందనలు తెలిపారు. ఉత్తమ పరిపాలన ఉంటే ఇలాంటి ఘనతలు సాధ్యమవుతాయన్నారు. చిన్నపాటి సమస్యలు ఇంకా ఉన్నప్పటికీ కుటుంబంలో ఏవిధంగా అంతా సర్థుకుపోతారో ఉద్యోగులు కూడా అదేవిధంగా సర్దుకు పోతుండడం మంచి వాతావరణానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐనవోలులో ఏర్పాటు చేసిన విట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.